MLC Kavitha: శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా..! 2 d ago

featured-image

TG : బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల అమ‌లు విష‌యంలో కాంగ్రెస్, బీజేపీ ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం వ‌హించాయ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయ‌ని, నేను చెప్పిన‌వి త‌ప్ప‌యితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాన‌ని క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇందిరా పార్క్ వ‌ద్ద నిర్వ‌హించిన బీసీ మ‌హాస‌భ‌లో క‌విత ప్రసంగించారు.ఈ దేశ మొదటి ప్రధాని నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారన్నారు. ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా..? మండల్ కమిషన్ మొరార్జీ దేశాయ్ నియమించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదు అని అన్నారు. మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది కానీ అమలు చేయలేదని తెలిపారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదన్నారు. కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసిందని తెలిపారు. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయన్నారు. నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాన‌ని క‌విత స‌వాల్ విసిరారు. కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీలకు న్యాయం చేశాయని చెప్పారు. కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారన్నారు. మహిళా విద్యకు ఎంతగానో కృషి చేశారు. ఎంతో మంది మహిళలకు చదువును నేర్పించారు సావిత్రీబాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమాజ వికాసం కోసం పని చేశారని క‌విత ప్ర‌శంసించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD